ఎగుమతులు దిగుమతులు

మన దేశం… వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా ప్రతి ఏడాది 41 బిలియన్ అమెరికన్ డాలర్ల వ్యాపారం చేస్తోంది. సవరించిన వ్యవసాయ చట్టాల ద్వారా ఇది మరింత పెరిగే అవకాశము ఉంది. దానికి అనుగుణంగా రైతులు ఆలోచనలు కూడా మార్చుకోవాల్సి వస్తుంది. అందులో భాగంగా మన చైతన్య గోదావరి సంస్థ కూడా రైతులకు అవగాహనా సదస్సులు నిర్వహిస్తోంది.

మన రైతులు పంటలు పండించే క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా బ్యాన్ చేసిన నిషిద్ద క్రిమిసంహారకాలను కూడా మోతాదులకి మించి వాడుతున్నారు. దానితో మన పంటలు ల్యాబ్ టెస్టుల్లో తిరస్కరించబడుతున్నాయి. అదే సమయంలో సేంద్రీయంగా పండించే పంటలకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది.

మన సంస్థ సేంద్రీయ వ్యవసాయము చేసే రైతుల దగ్గర పంటలను కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేయడం, అలాగే తక్కువ ధరలకి విదేశాలనుంచి సరుకు దిగుమతి చేసుకొని వాల్యూ అడిషన్ చేసి మన భారతీయ మార్కెట్ లో విక్రయించడం చేస్తోంది

మనం రైతులకు ఈవిధంగా సహాయపడగలం

  • విదేశీ మార్కెట్లకి మన రైతు సోదరులను పరిచయం చేయడం
  • ఎగుమతి దిగుమతి లైసెన్స్, ధరకాస్తులు, పేపర్ వర్క్ లో సహాయం
  • కంటైనర్ బుకింగ్, బ్యాంకింగ్ లో సహాయం
  • ల్యాబ్ టెస్టింగ్
  • వివాదాల పరిష్కారం