పశుగ్రాసం, దాణా

మనదేశం వ్యవసాయ ప్రధాన దేశం. మన యుగపురుషులు బలరామ చక్రవర్తి, శ్రీకృష్ణుడు పాడి పంటలకు ప్రతీకలుగా నిలిచి జాతికి ఆదర్శం అయ్యారు. పాడి లేకుండా పంట లేదు. ఆవు లేకుండా వ్యవసాయం ఉండదు. వ్యవసాయం ద్వారా వచ్చిన వ్యర్ధాలను పశువులు ఆహారంగా తీసుకుంటాయి. అలాగే పశువుల వ్యర్ధాలు వ్యవసాయానికి పోషకాలు అవుతాయి.

ఇప్పుడు మనదేశంలో ఎలాంటి దుస్థితి ఏర్పడింది.. అంటే వ్యవసాయం చేసేవారింట పాడి పశువులు లేవు. పశువులు పెంచేవారికి గ్రాసం కరువు. అప్పుడే పుట్టిన బిడ్డలకు కూడా విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న పాల డబ్బాలు కడుపునింపుతున్నాయి. మన అవసరాలకు తగ్గ పాల ఉత్పత్తి లేక మన దేశంలో కల్తీ పాలు, పిండి పాలు, నీళ్ళ పాలు దొరుకుతున్నాయి.

మనదేశంలో మెట్ట ప్రాంత రైతులకు ఆరు నెలల పాటు మాత్రమే పశుగ్రాసం అందుబాటులో ఉంటోంది. ఆ కారణం చేత పాడి పశువులను పోషించలేక వాటిని కాటికి అమ్మేస్తున్నారు. ఈ సమస్యకి పరిష్కారంగా మన సంస్థ రైతులకు అందుబాటు ధరల్లో పశుగ్రాసం అందిస్తోంది. ఈ పశుగ్రాసం తో పాటు పశువులకు అవసరమైన అత్యంత ఆవశ్యక సూక్ష్మ పోషకాలు మిళితం చేసి బాలవర్ధకమైన దాణా కూడా మన సంస్థ విక్రయిస్తోంది. ఇవి మన రైతు డిపోలలో అందుబాటులో ఉన్నాయి.

మన రైతు డిపోలలో ఇవి దొరుకుతాయి

  • పచ్చ గడ్డి, ఎండు గడ్డి
  • దాణా, సూక్ష్మ పోషకాల మిశ్రమం, ప్రోటీన్ మిశ్రమం
  • పశువులకు అవసరమైన ఔషదాలు, మూలికలు