ప్రొసెసింగ్, ప్యాకేజింగ్

పంటని యధాతధంగా అమ్ముకుంటే రైతులకు ఏమీ మిగలట్లేదు. అదే పంటని ప్రొసెసింగ్ చేసి అమ్మితే మంచి ధర లభిస్తుంది. ధాన్యం అమ్మితే క్వింటాల్ రెండు వేలు ధర పలుకుతోంది. అదే బియ్యంగా మార్చి అమ్మితే అరవై కేజీల బియ్యం మూడు వేలు ఉంది. నువ్వుల నూనె, వేరుశెనగ నూనె ధరలు… ముడి సరుకు కన్నా మంచి ధర పలుకుతాయి.

చిన్న సన్నకారు రైతులకు కూడా తమ పంటలని ప్రొసెసింగ్, ప్యాకేజింగ్ చేసుకొని డిమాండ్ ఉన్న చోట అమ్ముకోగలిగితే తమ ఆదాయాన్ని రెండింతలు చేసుకోవడం అంతా కష్టం కాదు. ఉత్సాహం ఉన్న రైతులకు మన సంస్థ సువర్ణావకాశాన్ని ఇస్తోంది. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా ముడి సరుకుని సేకరించి వాటిని మన చైతన్య గోదావరి బ్రాండ్ ద్వారా దేశవిదేశాల్లో మార్కెట్ చేయడం అనే బృహత్తర బాధ్యతలని మన కంపెనీ స్వీకరించింది.

మనం ఈవిధంగా సహాయపడగలం

  • కొబ్బరి పంట: కొబ్బరి కాయలను కాయలుగా అమ్ముకుంటే దింపుకొనే డబ్బులు కూడా రావట్లేదు. అదే కొబ్బరి నూనె, కొబ్బరి పాలు, పీచు, కొబ్బరి పొత్తు, కోకోనట్ పీట్ లాగ వేరుచేసి అమ్ముకోగలిగితే రైతు మంచి లాభాలను సాధించవచ్చు.
  • పండ్లు: పండ్లను మనం ఎక్కువ రోజులు నిల్వ వుంచలేము. అలాగే పంటని తోటలోనుంచే అమ్ముకుంటే దళారీలు అర్ధరూపాయికి పావలాకీ మన పంటని కొనేస్తారు. అలా కాకుండా పండ్ల రసాలు చేసి అమ్ముకోగలిగితే మంచి ధర తెచ్చుకోగలం
  • ఊరగాయలు, తినుబండారాలు, సాస్, జామ్.. వంటి ఆహార పదార్ధాలను మన బ్రాండ్ మీద అమ్మడం