ప్రొక్యూర్మెంట్

రైతుకి పంట పండించడం ఒక యజ్ఞం అయితే గిట్టుబాటుధర తెచ్చుకోవడం మరింత కష్టంగా మారింది. పండిన పంటని నిల్వ చేసుకోడానికి గిడ్డంగులు లేక, మార్కెట్ కి తీసుకువెళ్ళే మార్గంలేక రైతు కళ్లెంలోనే అమ్ముకునే పరిస్థితి ఉంది. దీన్ని ఆసరాగా తీసుకుని దళా రీలు రైతులను మోసం చేస్తూనే ఉన్నారు. మారు బేరానికి సరుకుని అమ్మే మద్యవర్తులందరూ సిండికేట్ లా ఏర్పడి పంట ధరని ముందుగానే నిర్ణయించి అదే రేట్ కి రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేస్తున్నారు.

ఈ సమస్యకి పరిష్కారంగా చైతన్య గోదావరి సంస్థ పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతులకు లాభసాటి ధర కల్పించే విధంగా ప్రయత్నం చేస్తోంది. మొదటిదశలో కేవలం సేంద్రీయ వ్యవసాయంలో పండించిన పంటలను మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మన సంస్థ సభ్యులు పండించిన పంటలకి మార్కెట్ కల్పించడమే కాకుండా ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల పంటలను కూడా సేకరించి మన సూపర్ బజార్ లలో విక్రయిస్తోంది.

మేము ఈ పంటలను కొనుగోలు చేస్తాము

  • సేంద్రీయ విధానంలో పండించిన ధాన్యం, చిరు ధాన్యాలు
  • నువ్వులు, వేరుశెనగ, కొబ్బరి
  • కందులు, మినుములు, పెసలు, ఇతర పప్పు దినుసులు
  • నారింజ, బత్తాయి, నిమ్మ, మామిడి, బొప్పాయి, సపోటా
  • పసుపు, మిరప, ప్రత్తి
  • సేంద్రీయంగా పండించిన కూరగాయలు, ఆకుకూరలు