స్టోరేజీ, రవాణా

వ్యవసాయాన్ని పూర్తి ప్రయోజన కరంగా సంస్కరించి, రైతుల ఆదాయాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్నో పధకాలను ప్రవేశపెట్టింది. కానీ ప్రభుత్వ అధికారుల అలసత్వం, రాజకీయ నాయకుల స్వార్ధం కారణంగా అవి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోలేక పోతున్నాయి. వీటికి ప్రత్యమన్యాయంగా చైతన్య గోదావరి సంస్థ ఏర్పాటు చేయబడింది.

రైతులు మంచి ధర వచ్చేదాకా నిల్వ చేసుకోగలిగితే.. అలాగే ఎంత దూరం అయినప్పటికీ.. డిమాండ్ ఉన్న మంచి మార్కెట్ లో అమ్ముకోగలిగితే రైతులకు నష్టాలు రావు. కానీ చిన్న, సన్నకారు రైతులకు ఇది అంత సులభం కాదు. ఈ సమస్యని పరిష్కరించడానికి మన కంపెనీ శీతల గిడ్డంగులను నిర్మించి తక్కువ రుసుముకి రైతులకు రెంట్ కి ఇస్తోంది. అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న మార్కెట్లకి సరుకుని పంపించి పంటకి మంచి ధర అందేలా కృషి చేస్తోంది.

మనకే స్వంతంగా గిడ్డంగులుంటే ఉపయోగం:

గిడ్డంగులు సప్లయ్ చైన్ మార్కెట్లో అంతర్భాగం. ఇవి పంటని మంచి ధర వచ్చేదాకా భద్రపరచడానికి, అలాగే సరుకు పాడవకుండా నిల్వ ఉంచడానికి ఉపయోగ పడతాయి. పండించిన పంట మొత్తాన్ని ఒకేసారి వినియోగంలోకి తీసుకురాలేము. రెండు పంట కాలాలకి మధ్య.. ఏడాడి పొడవునా మార్కెట్ అవసరాలకి తగ్గట్టు గోడౌన్ నుంచి సరుకుని తీసుకొచ్చి మంచి ధరకి అమ్ముకోవచ్చు

రవాణా

సవరించిన చట్టాలను అనుసరించి ఇప్పుడు రైతులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా తన పంటని అమ్ముకోగలరు. ఇది వినడానికి బాగానే ఉంటుంది కానీ అమలులో చాలా కష్టమనే భావన రైతుల్లో ఉంది. అందుకని ఇప్పటికీ రైతులు తమ పంటని దలారీలకి, మిల్లరలకీ అమ్ముకుంటున్నారు. దీనికి పరిష్కారంగా మన సంస్థ తమ స్వంత వాహనాల ద్వారా మన రైతుల పంటలని గిరాకీ ఉన్నచోటికి తీసుకువెళ్ళి అమ్ముకోవడానికి సహాయపడుతోంది.