వ్యవసాయ అవసరాలు

మనదేశంలోని రైతులు విత్తనాలను సమీకరించుకోవడం దగ్గరనుంచి పంటని అమ్ముకోవడం వరకూ అన్నివిధాలా మోసపోతున్నారు. మార్కెట్ లో దొరుకుతున్న నాసిరకం విత్తనాలు, కల్తీ పురుగుమందుల వల్ల వ్యవసాయరంగం కుదెలవుతోంది. సమయానికి రైతుకూలీలు దొరకాక పోవడం ప్రధాన సమస్యగా ఉంది. ఆధునిక సాంకేతిక పరికరాలైన ప్లాంటేర్, హారవెస్టర్ యంత్రాల బాడుగ విపరీతమైన ఖర్చుతో కూడుకోవడంతో ఇవి సగటు రైతుకి అందుబాటులోకి రావట్లేదు.

ఈ సమస్యలకి ఎదురొడ్డి, ప్రకృతి ప్రకోపాలకి తలవొగ్గి వ్యవసాయం చేసినప్పటికీ పండించిన పంటకి గిట్టుబాటు ధర కూడా రావట్లేదు. మన పంటలకి ఎంత ధర ఉండాలో దళా రీలు నిర్ణయిస్తున్నారు. మార్కెట్ లో మనం పండించిన పంటలకి మంచి డిమాండ్ ఉన్నప్పటికీ రైతు చేతకానివాడిలా మద్యవర్తుల చేతుల్లో మోసపోతున్నాడు.

మన చైతన్య గోదావరి సంస్థ ఈ సమస్యలకి పరిష్కారంగా ఏర్పాటు చేయబడింది. ఇది రైతులకోసం రైతులు నడుపుతున్న సంస్థ. మన కంపెనీ రైతుకి అన్నివిధాలా చేదోడువాదోడుగా ఉంటూ రైతుల ఆదాయాన్ని రెండితలు చేయడంలో సహకరిస్తుంది.

మనం రైతులకు ఏవిధంగా సహాయపడగలం

  • విత్తనాలు, నారు, నర్సరీ మొక్కలు: మన చైతన్య గోదావరి సంస్థ అన్నిరకాల వ్యవసాయ పంటలకి సంబంధించిన దేశవాళీ వంగడాలను అత్యంత ప్రయాసలతో సమీకరించి భద్రపరిచి నిల్వచేసింది. ఇవి చీడపీడలను, వర్షాభావ పరిస్థితులను కూడా తట్టుకొని నిలిచి మంచి దిగుబడినిస్తాయి.
  • ఆధునిక యంత్రాలు, పనిముట్లు: చిన్న సన్నకారు రైతులు హారవెస్టర్ మిషిన్, పవర్ టిల్లర్, బేలర్లు వంటి ఆధునిక పనిముట్లను సమకూర్చుకోలేరు. మన కంపెనీ అతి తక్కువ ధరలకే అన్నిరకాల ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సగటు రైతుకి అందుబాటులోకి తెస్తోంది.
  • సేంద్రీయ ఎరువులు, క్రిమిసంహారకాలు: గో ఆధారిత వ్యవసాయ విధానాని పునరుద్ధరించి ప్రకృతి సహజమైన, ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మన చైతన్య గోదావరి సంస్థ తీవ్ర కృషి చేస్తోంది. అందులో భాగంగా సేంద్రీయ ఎరువులు, క్రిమిసంహారకాలను రైతులకు అందుబాటులోకి తెచ్చింది.