ఆధునిక వ్యవసాయం

సాంప్రదాయ వ్యవసాయ పద్దతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం ద్వారా గణనీయమైన దిగుబడులను సాధించవచ్చు. చిన్న సన్నకారు రైతులు హారవెస్టర్ మిషిన్, పవర్ టిల్లర్, బేలర్లు వంటి ఆధునిక పనిముట్లను సమకూర్చుకోలేరు.

చైతన్య గోదావరి సంస్థ మన రైతు సోదరులకు అత్యంత ఆధునిక పరికరాలను అందుబాటు ధరల్లో రెంట్ కి ఇస్తుంది. వీటి ద్వారా సగటు రైతు తన పెట్టుబడిలో 20 శాతం దాకా ఖర్చుని ఆదా చేసుకోవచ్చు. అదేవిధంగా రైతుకూలీల సమస్యని కూడా చాలా వరకూ ఆధునిక వ్యవసాయ పద్దతుల్లో పరిష్కారం దొరుకుతుంది.

మన రైతులకు అందుబాటులో ఉండే పరికరాలు

  • ట్రాక్టర్, టిల్లర్, వీల్ బరో, ప్లవ్ ట్రాక్టర్, ట్రాలీ బండ్లు
  • హారవెస్టర్ మిషిన్, బేలర్స్
  • సీడర్స్, ప్లాంటేర్ మెషీన్
  • గ్రాస్ కట్టర్, బ్రష్ మెషీన్
  • స్ప్రెయర్, డ్రోన్
  • బిందు సేద్యం, తుంపర సేద్యం పరికరాలు

మన సంస్థ పైన పేర్కొన్న పరికరాలను, యంత్ర సామగ్రిని బాడుగకి ఇవ్వడమే కాకుండా గ్రామీణ యువతకి ఈ పరికరాలను వాడటం, నడపటం, సర్విస్ చేయడం వంటి విషయాల్లో తర్ఫీదు ఇవ్వడం కూడా చేస్తుంది. ఆసక్తి కలిగిన యువకులు మన సంస్థ కార్యాలయానికి ఫోన్ చేసి పూర్తి వివరాలు పొందవచ్చు