మైక్రో ఇరిగేషన్

సాగు నీటి సమస్యకి పరిష్కారంగా ప్రారంభమైన మైక్రో ఇరిగేషన్ (సూక్ష్మ నీటి విధానం) రెండు రకాల సాగునీటి విధానాలు అందుబాటులోకి వచ్చాయి. మొక్క మొదలుకు నీరు అందించే ప్రక్రియ బిందు సేద్యం ద్వారా జరుగుతుంది. మొక్కపై తేమశాతం పెంచేందకు తుంపర సేద్యం ఉపయోగపడుతుంది. హరితవిప్లవం వల్ల దేశంలో దిగుబడులు పెరిగినప్పటికీ , ఆధికంగా ఉన్న చిన్న రైతులు విస్మరించబడ్డారు . ఈ తరుణంలో బిందు సేద్యం చిన్న , సన్నకారు రైతు కమతాల్లో కూడా వెలుగు నింపగలదని తేటతెల్లమైంది .

మామిడి, బత్తాయి, నిమ్మ, సపోటా, ఆయిల్ పామ్, కూరగాయలు, మిరప, చెరకు, అరటి మొదలగు తోటలకు బిందు సేద్యం.. అలాగే వేరుశనగ, మినుము మొదలగు మెరక పంటలకు స్ప్రింక్లర్ల సేద్యాన్ని అమలు పరిచి అధిక దిగుబడిని సాధించవచ్చు.

అర్హత కలిగిన రైతులకు ధరకాస్తూ చేసుకుంటే ప్రభుత్వాలు.. ఈ బిందుసేద్యం, తుంపర సేద్య విధానాలకు 50% నుంచి 100% దాకా రాయతీలు అందజేస్తుంది.

మన సంస్థ ద్వారా రైతులకు అందిస్తున్న సహకారం

  • ఇంజనీరింగ్ డిజైన్, ప్రొక్యూర్మెంట్
  • ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం
  • ఇన్స్టలేషన్, మోటార్ ఫిట్టింగ్, సర్వీసింగ్
  • ప్రభుత్వ పధకాలు లైజనింగ్ చేసిపెట్టడం