దేశవాళీ వంగడాలు

మనదేశంలో హరిత విప్లవం కారణంగా దేశవాళీ విత్తనాల వినియోగం తగ్గుముఖం పట్టింది. అధిక దిగుబడుల మోజులోపడి మన రైతులు నాణ్యమైన దేశీయ విత్తనాలను విస్మరించారు. ఇప్పుడు వరి, గోదుమ, మొక్కజొన్న పంటలు, అలాగే కూరగాయలు, పండ్ల జాతుల మొక్కలలో దేశవాళీ రకాలు కనుమరుగయ్యాయి.

మన చైతన్య గోదావరి సంస్థ అన్నిరకాల వ్యవసాయ పంటలకి సంబంధించిన దేశవాళీ వంగడాలను అత్యంత ప్రయాసలతో సమీకరించి భద్రపరిచి నిల్వచేసింది.

అలా భద్రపరిచిన విత్తనాలను ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేసి సంప్రదాయ వ్యవసాయం చేయాలనుకునే అభిలాష కలిగిన రైతు సోదరులకి తక్కువ ఖరీదులో అందిస్తోంది. మన దేశీయ విత్తనాలు అన్నిరకాల వర్షాభావ పరిస్థితులను, చీడపీడలను తట్టుకోగలవు. మన వ్యవసాయ క్షేత్రాన్ని సేంద్రీయ ఎరువులతో భూమి సుపోషణ చేసుకుంటే సంకరజాతి హైబ్రీడ్ విత్తనాలకు ధీటుగా దిగుబడి సాధించవచ్చు.

మా దగ్గర అన్నీ రకాల దేశవాళీ విత్తనాలు లభిస్తాయి

  • వరి, గోదుమ, మొక్కజొన్న, అన్నిరకాల చిరుధాన్యాలు
  • మామిడి, కొబ్బరి, సపోటా, నిమ్మ, నారింజ, పనస, బొప్పాయి, అరటి, జామ, ఇతర పండ్ల జాతి మొక్కలు
  • వంకాయ, బెండ, చిక్కుడు, టమోటా, దొండ, పొట్లకాయ, ఆనపకాయ, కాకర, ఇతర కూరగాయల మొక్కలు
  • గులాబీ, మల్లె, మందార, బంతి, చామంతి, లిల్లీ, ఇతర పూల మొక్కలు
  • టేకు, వేప, మద్ది, రవి, నేరేడు, ఇతర అడవి జాతి మొక్కలు
  • కరక్కాయ, జాజి, ఉసిరి, తానికాయ, తిప్పటీగా, తాములపాకు, మారేడు, రేగుకాయ, ఇతర ఔషద మొక్కలు

పైన పేర్కొన్న అన్నీ మొక్కల జాతులకి సంబంధించిన దేశవాళీ వంగడాలు, నారు మా సంస్థలో అందుబాటులో ఉన్నాయి. కావాలనుకొనే వారు మా కార్యాలయానికి ఫోన్ చేసి ఆర్డర్ చేయవచ్చు