గో ఆధారిత వ్యవసాయం
బంగారు నేలలు రాటుదేలిపోతున్నాయ్. సిరుల పంటలు పతనమైపోతున్నాయి. సౌభాగ్యవంతమైన సుక్షేత్రాలు నిర్జీవమైపోతున్నాయ్. కారణమేమిటి? నేల సహజత్వం కోల్పోవడమే కదా? నిస్సారమైపోతున్న నేలలకి చికిత్స చేయడానికి, ఫలదత తగ్గిన మట్టికి జీవం పోయడానికి పుడమికి శక్తినిచ్చేదే ఈ “భూ సుపోషణ” కార్యక్రమం.
పోషకాహారం మనిషి మనుగడకు ఎంత అవసరమో భూమికి కూడా అంతే అవసరం. మన రైతు సోదరులు ఈవిషయం పట్టించుకోకుండా అధిక మోతాదుల్లో రసాయనిక ఎరువులు, క్రిమిసంహరకాలు వాడటంవల్ల భూమి నిస్సారంగా మారింది. సేంద్రీయ వ్యవసాయం కేవలం ఉత్పాదకత కోసమే కాదు. ఇది పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిద్యాన్ని కాపాడటం, పోషకపదార్ధాల సమతుల్యత వంటి సమీకృత ఫలితాలను అందించి వినియోగదారులకు ఆరోగ్యాన్ని, రైతులకు ఆనందాన్ని పంచుతుంది.
పంచగవ్య, మూలికలు ఉపయోగించి సస్య రక్షణ చేయడం మనకు అనాదిగా వస్తున్న విధానం. అటువంటి గో ఆధారిత వ్యవసాయ విధానాని పునరుద్ధరించి ప్రకృతి సహజమైన, ఆరోగ్యకరమైన వ్యవసాయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి మన చైతన్య గోదావరి సంస్థ తీవ్ర కృషి చేస్తోంది. అందులో భాగంగా సేంద్రీయ ఎరువుల తయారీ, క్రిమిసంహారకాలు, అలాగే దేశవాళీ విత్తన శుద్ధి వంటి విషయాలపై అభిరుచి కలిగిన రైతులకు శిక్షణ ఇస్తోంది.
ఎలా సంప్రదించాలి
అభిరుచి కలిగిన రైతులు మన సంస్థ కార్యాలయాన్ని సంప్రదిస్తే వారికి సేంద్రీయ ఎరువుల తయారీ, అలాగే క్రిమిసంహారకాలు, కలుపుమొక్కల మందుల తయారీ పై ప్రత్యేక శిక్షణ ఇవ్వగలము. అలాగే రైతులకు అందుబాటు ధరల్లో… పైన పేర్కొన్న మందులు, ఎరువులను మన సంస్థ విక్రయిస్తోంది.