వ్యవసాయ ఆధారిత సేవలు
మనది వ్యవసాయ ఆధార దేశం. మనదేశ యువతకి వ్యవసాయం చేయడం చాలా ఇష్టం. ఈ కారణం వల్లే పెద్దగా లాభాలు రాకపోయినా.. పెట్టుబడి తిరిగివస్తే చాలు అనే ఆలోచనతో వ్యవసాయం చేస్తున్నారు. గత నాలబై ఏళ్లగా వ్యవసాయరంగంలో వచ్చిన వింతపోకడల వల్ల మన రైతులు సంప్రదాయ వ్యవసాయ విధానాలను మర్చిపోయారు. అలాగే ఆధునిక సాంకేతికతని అందిపుచ్చుకోలేక పోయారు.
మన చైతన్య గోదావరి సంస్థ సేంద్రీయ వ్యవసాయంలో ఆధునికతని మేళవించి గ్రామీణ యువత కోసం నైపుణ్య శిక్షణా తరగతులను నిర్వహిస్తోంది. వీటి ద్వారా నిరుద్యోగ సమస్యకి పరిష్కారం లభించడమే కాకుండా మంచి ఆరోగ్యకరమైన పంటలు ప్రజలకి అందుబాటులోకి వస్తాయి.
మన సంస్థ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు
- భూసార పరీక్షలు, రైతులకు సూచనలు: భూమిలో సారాన్ని తెలుసుకొని అవసరమైనంత ఎరువులు మాత్రమే వాడి, ఆమేరకు పెట్టుబడులు తగ్గించుకొనేందుకు భూసార పరీక్షలు ఉపయోగపడతాయి. ప్రస్తుత పరిస్తితుల్లో ప్రతి రైతు తన పొలంలో విధిగా భూసార పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మన సంస్థ ఈ సర్వీసులను రైతులకు అందుబాటులోకి తెచ్చింది.
- నైపుణ్య శిక్షణ: ప్రస్తుతం రైతులు ఎదుర్కుంటున్న సమస్యలకి పరిష్కారంగా మన చైతన్య గోదావరి సంస్థ రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతులపై నైపుణ్య శిక్షణ, అలాగే వ్యవసాయేతర వృత్తులలో కూడా శిక్షణ ఇస్తోంది. చదవడం రాయడం వచ్చిన ప్రతిఒక్కరూ ఈ శిక్షణా తరగతులకు హాజరవ్వచ్చు
- పరిశోధనలు, ప్రచురణలు: గో ఆధారిత వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్, సమీకృత వ్యవసాయ విధానం.. వంటి ప్రకృతి వ్యవసాయ పద్దతుల్లో పరిశోధనలు చేయడం, వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం మన కంపెనీ సామాజిక బాధ్యతగా భావిస్తోంది. అందుకోసమని ఆన్లైన్ పత్రికని నిర్వహిస్తోంది.