కౌలు వ్యవసాయం
వ్యవసాయం ఒక జీవన విధానం. ఇందులో లాభాపేక్షకి తావు లేదు. పూర్వ కాలంలో కుటుంబంలోని ప్రతిఒక్కరూ తమ వ్యవసాయ క్షేత్రంలో ఏదో ఒక పని చేసుకొనేవారు. రైతుకి తన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, భార్యాపిల్లలు తొడువస్తేనే వ్యవసాయంలో నెగ్గుకురాగలాడు. అలా కాకుండా ప్రతిచిన్న పనికి కూలీల మీద ఆధార పడితే పంటమీద వచ్చిన దిగుబడి మొత్తం కూలి డబ్బులకు కూడా సరిపోదు.
ఈ కారణం చేత మద్యతరగతి వర్గం వ్యవసాయానికి మెల్ల మెల్లగా దూరమవుతూ పోతోంది. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగిరాకపోవడంతో ఈ రైతులు తమ భూములని బీడులుగా వదిలేసి పిల్లల భవిష్యత్తు కోసం, మంచి చదువుల కోసం, ఉద్యగాల కోసం పట్టణాలకి వలస వెళ్లిపోతున్నారు. పెద్ద కమతాలు లేక, వ్యవసాయం లాభసాటి కాక మన దేశంలో అందుబాటులో ఉన్న భూమిలో ముప్పై శాతం కూడా సాగుబాడీలో లేదు. ఉన్న భూమిని కూడా పూర్తి సామర్ధ్యానికి వినియోగించక మన దేశం వ్యవసాయ ఉత్పత్తులను కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సమస్యలకి పరిష్కారంగా చైతన్య గోదావరి సంస్థ కౌలు కి భూములను తీసుకొని వ్యవసాయం చేస్తోంది. దీనివల్ల గ్రామాల్లో నిరుద్యోగ సమస్య తీరడంతో పాటు మన దేశానికి కావాల్సిన ఆహార ధాన్యాలను సమకూర్చుకోవడంలో స్వావలంబన సాధించవచ్చు.
మనం ఈ విధంగా సహాయపడగలం
- తోటల నిర్వహణ
- కౌలు / పాలు వ్యవసాయం
- పెట్టుబడి సాయం