సహకార సేద్యం
సహకార ఉద్యమం… గత వెయ్యేళ్లలో మన సమాజానికి అందిన గొప్ప ఆవిష్కరణ కింద భావించవచ్చు. కానీ ఈ ఉద్యమాన్ని వామపక్ష భావజాలం ఉన్న కొన్ని అరాచక శక్తులు హై జాక్ చేయడంతో ట్రేడ్ యూనియన్ పేరిట, అలాగే రైతు కూలి సంఘాల పేరిట ఈ ఉద్యమాన్ని నీరు కార్చాయి. రైతు ఒక వ్యక్తిగా సమస్యలపై పోరాడలేక పోవచ్చు. కానీ ఒక సమూహంగా పోరాడి సాధించుకోగలడు. అది పంటలకి గిట్టుబాటు ధర కావచ్చు, సాగునీటి సమస్యలు కావొచ్చు, పంట విరామాలు, ప్రభుత్వ పధకాలు, రాయతీలు.. ఇలాంటి ఎన్నో సమస్యలని కలెక్టివ్ బార్గేనింగ్ (సమిష్టి బేరం) ద్వారా రైతులు పరిష్కరించుకోవచ్చు.
శ్వేత విప్లవం భారతదేశంలో పాడి పరిశ్రమలో ఉన్న ఎన్నో సమస్యలకి పరిష్కారం చూపింది. ఇప్పుడు అమూల్, విజయ మిల్క్ డైరీ, విశాఖ.. అలాగే ఎన్నో సహకార సంఘాలు తమ ఉత్పత్తుల ధరలను తామే నిర్ణయించగల శక్తులుగా ఎదిగాయి. ఇదే బాటలో వ్యవసాయాన్ని కూడా లాభసాటిగా మార్చాలనే సదుద్దేశ్యంతో ఈ చైతన్య గోదావరి రైతు ఉత్పత్తిదారుల సంస్థని ఏర్పాటు చేసుకున్నాము. ఇది రైతుల కోసం రైతులు నిర్వహించే కంపనీ.
సహకార సేద్యం వల్ల లాభాలు
- మన సంస్థ పంటల ఆధారంగా రైతు క్లబ్ లను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా యాబై మంది రైతులు కలిసి ఒక క్లస్టర్ గా ఏర్పాటు అయ్యి వాళ్లందరూ ఒకే పంటని పండించుకోవాలి. అప్పుడు విత్తనాలు, పరికరాలు, ఎరువులు, మందులు, అలాగే పంట ధర.. వంటి విషయాల్లో మంచి రేట్ కి బేరం చేయవచ్చు
- ప్రొసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకొని మన పంటలను మన సూపర్ బజార్స్ లోనే అమ్మేవిధంగా వ్యాపారం చేసుకోవచ్చు.
- ఎగుమతి, దిగుమతి లైసెన్స్, కంటైనర్ బుకింగ్ వంటి పనులలో స్వాలంబన
- ఇప్పుడున్న అవకాశాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా మన పంటలకి మార్కెట్ సాధించవచ్చు
మన సంస్థలో సభ్యత్వం తీసుకోవడం ఎలా…
మన కంపెనీలో చేరాలనుకొనే రైతులు మన కార్యాలయానికి వచ్చి పూర్తి వివరాలు పొందవచ్చు. ప్రస్తుతం సభ్యత్వ స్వీకరణ డ్రైవ్ జరుగుతోంది. అనుకున్న సంఖ్య చేరుకున్న తరువాత ఈ స్కీమ్ ముగిసిపోతుంది. అందువల్ల ఆసక్తి కలిగిన యువకులు, మా సంస్థలో సభ్యులు గా చేరాలనుకొనే రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు