పరిశోధనలు.. ప్రచురణలు..

వ్యవసాయం కేవలం రైతులకి జీవనోపాది మాత్రమే కాదు. సమస్త జీవకోటికి ప్రాణాధారం. ఆరోగ్యకరమైన సమాజమే ఆనందంగా మనగలుగుతుంది. అభివృద్ధి సాధించగలదు. అనాదికాలంగా మన గ్రామాలు వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకొనే మనుగడ సాగించాయి. గత నాలబై ఏళ్లలో వచ్చిన వింత పోకడల వల్ల వ్యవసాయ రంగం సర్వ నాశనం అయ్యింది. అధిక దిగుబడుల మోజులో పడి రైతు మన సంప్రదాయ వ్యవసాయ రీతులను విస్మరించాడు. లాభాల మాట దేవుడెరుగు. మొత్తం సమాజం రోగ బుయిష్టం అయ్యింది. ప్రపంచంలో అత్యధికంగా షుగర్ వ్యాదిగ్రస్తులు మన దేశంలోనే ఉన్నారని అన్ని గణాంకాలు చూపిస్తున్నాయి. మన పిల్లలు మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ వంటి వ్యాదుల బారిన పడి బలహీన పడుతున్నారు.

మన వంతుగా మనమేమి చేయగలం

వీటికి పరిష్కారంగా మన చైతన్య గోదావరి సంస్థ ప్రకృతి వ్యవసాయం పై పరిశోధనలను ప్రోత్సాహిస్తోంది. ఆసక్తి కలిగిన యువకులు గో ఆధారిత వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్, సమీకృత వ్యవసాయ విధానం.. వంటి ప్రకృతి వ్యవసాయ పద్దతుల్లో పరిశోధనలను ప్రోత్సాహిస్తోంది.

యువరైతులు వ్యవసాయరంగానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలు చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. వారి అర్హతలు ఆధారంగా వారికి స్కాలరషిప్స్ ఇచ్చి ప్రోత్సాహిస్తాము. ప్రకృతి వ్యవసాయ విధానాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం మన కంపెనీ సామాజిక బాధ్యతగా భావిస్తోంది. అందుకోసమని పత్రికని నిర్వహిస్తోంది. మరిన్ని వివరాలకు మన కార్యాలయాన్ని సంప్రదించగలరు