భూసార పరీక్షలు
దేశంలో 70 శాతం మంది ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఇంతకాలం దేశానికి వెన్నుముకగా ఉన్న వ్యవసాయం రైతులు పాటిస్తున్న అశాస్త్రీయ విధానాల వల్ల అధోగతి పాలయ్యింది.
భూమిలో సారాన్ని తెలుసుకొని అవసరమైనంత ఎరువులు మాత్రమే వాడి, ఆమేరకు పెట్టుబడులు తగ్గించుకొనేందుకు భూసార పరీక్షలు ఉపయోగపడతాయి. ప్రస్తుత పరిస్తితుల్లో ప్రతి రైతు తన పొలంలో విధిగా భూసార పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది.
గత కొంతకాలంగా మన రైతులు విచ్చలవిడిగా ఎరువులను వాడేయడంతో మన భూమిలో పోషకాల సమతుల్యత లోపించింది. పంటలని బట్టికాకుండా భూమిలో సారాన్ని బట్టి ఎరువులను వాడటం మంచి పద్దతి.
భూసార పరీక్షలు చేయించకుండా ఇష్టానుసారంగా రసాయినిక ఎరువులు వాడితే రైతుకి పెట్టుబడులు పెరిగిపోవడమే కాకుండా వాతావరణం కూడా కాలుష్యం అవుతుంది.
మనం రైతులకు ఈవిధంగా సాయపడగలం
- మట్టి నమూనా సేకరణ
- ప్రయోగశాలలో పరీక్షలు
- ఫలితాలను బట్టి రైతులకు సరైన సూచనలు చేయడం